హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17
: బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతిసారీ విదేశీ శక్తులను తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. చైనా భూ ఆక్రమణపై మాట్లాడే దమ్ము మోదీకి లేదన్నారు. రోహింగ్యాల పేరుతో దేశ ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. దొరికితే దొంగ అన్నట్లుంది బీజేపీ తీరు అంటూ మండిపడ్డారు. ఈడీ దాడులు కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలపైనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఎన్నిక పక్రియ నిబంధనలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు మార్చారని, కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఎందుకు తొలగించారని పీసీసీ చీఫ్ నిలదీశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎన్నికైన రోజే ప్రమాదాన్ని గురించి రాహుల్ గాంధీ హెచ్చరించారని గుర్తుచేశారు. ‘మీరు ప్రజల మద్దతుతో గెలవలేరు.. అందుకే ఓటు దొంగతనానికి పాల్పడ్డారు’ అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. పెద్ద రాష్ట్రాలలో ఓట్ల దొంగతనం ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీపీఎం మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామని మహేశ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో సీపీఎం కలసి పనిచేస్తోందని చెప్పారు. నేటి సీపీఎం పోలిట్‌బ్యూరో మీటింగ్ తర్వాత వారి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారన్నారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మద్దతు కూడగడతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Latest News
బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడింది’.. -టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
nagendra18 October 2026, 2:30 AM0 viewstrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
Also read
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా - - తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మ ప్రతీక

పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన నాలుగు రోజుల్లో 40 గంటల పర్యటన..

భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం

గ్లోబల్ సమ్మిట్ లో ప్రముఖులందరూ పాల్గొనేలా చూడాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

