Saturday17 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
भाषाएँ

Latest News

కనకదుర్గమ్మ కు సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

nagendra17 October 2026, 4:49 AM0 व्यूtrinetnews.com
కనకదుర్గమ్మ కు సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

Share this story

Share link keeps your language (?lang=)

విజయవాడ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16:

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం తనకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించిందని తెలిపారు.

దర్శన సమయంలో భక్తుల నుంచి లభించిన ఉత్సాహభరిత స్పందన తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం వెల్లడించారు. అమ్మవారి దర్శనాలు, సేవల పట్ల భక్తుల్లో సంతృప్తి కనిపించిందని పేర్కొన్నారు. నేటి అమ్మవారి దర్శన అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చంద్రబాబు తెలిపారు.

यह भी पढ़ें