Saturday17 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
भाषाएँ

Latest News

చిరుజల్లుల మధ్య.. గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీవారి గరుడసేవ లక్ష్మీకాసుల మాలధారిగా గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం

nagendra17 October 2026, 4:47 AM0 व्यूtrinetnews.com
చిరుజల్లుల మధ్య.. గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీవారి గరుడసేవ లక్ష్మీకాసుల మాలధారిగా గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం

Share this story

Share link keeps your language (?lang=)

తిరుమల, అక్టోబరు 16, 2026

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉన్న వేలాది భక్తులు

తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు.

రాత్రి 6.30 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం ప్రసాదించారు. గజరాజుల గంభీర నడక, మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషల నడుమ సాగిన గరుడసేవ భక్తులను పరవశింపజేసింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రాన్ని మార్మోగించారు.

వర్షంలోనూ తరగని భక్తిభావం

మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, బిస్కెట్ ప్యాకెట్లు అందించింది. వర్షంలోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

గరుడ వాహనసేవ.. భక్తి, జ్ఞాన వైరాగ్యాలకు ప్రతీక

వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహనసేవకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. భగవంతునికి పరమ భక్తుడైన గరుడాళ్వారిపై స్వామివారు విహరించడం భక్తి, శరణాగతికి ప్రతీకగా నిలుస్తుంది. గరుడుని దర్శనం సర్వపాప ప్రక్షాళనకు, జ్ఞాన వైరాగ్య ప్రాప్తికి మార్గమని పురాణాలు తెలియజేస్తున్నాయి. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకోవడం తమ జన్మ ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें