Saturday17 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
Languages

Latest News

నీతి బోధక కథల సంపుటి మనుషులూ మనస్తత్వాలు

nagendra17 October 2026, 4:45 AM0 viewstrinetnews.com
నీతి బోధక కథల సంపుటి మనుషులూ మనస్తత్వాలు

Share this story

Share link keeps your language (?lang=)

  1. హైదారాబాద్ , ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 16:

సమాజం లో విభిన్న మనుష్యుల స్వభావాలు కు అద్దం పడుతూ నీతి బోధకం గా మనుషులూ మనస్తత్వాలు సంపుటి లోని కథలు వున్నాయని ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె వి రమణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై జి వి ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నిర్వహణలో త్యాగరాయ గాన సభ సౌజన్యం తో సాహితీ కిరణం పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు రచించిన మనుషులూ మనస్తత్వాలు కథా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమణ సంపుటి ఆవిష్కరణ చేసి మాట్లాడారు పొత్తూరి సుబ్బారావు ప్రభుత్వ సమాచార శాఖ లో అధికారిగా పని చేసిన కాలం తారస పడిన పలువురు వ్యక్తుల స్వభావాలను నిశితంగా అధ్యయనం చేసి రాసిన కథలు నేటి తరం చదవ వలసిన అవసరం ఉందని చెప్పేరు అధ్యక్తత వహించిన ప్రముఖ అధ్యాత్మిక వేత్త పులివర్తి కృష్ణ మూర్తి మాట్లాడుతూ పొత్తూరి సుబ్బారావు సాహితీ పత్రిక ను నడుపుతూ ఎంతో మంది రచయితలను ప్రోత్సహిస్తూ తను తన సాహితీ వ్యాసంగం కొనసాగిస్తున్నారు అని అభినందించారు వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రముఖ కథా రచయిత డాక్టర్ వై రామ కృష్ణా రావు లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదివి మనుషుల వ్యక్తిత్వం గురించి ఆసక్తి గా తెలుసుకోవాల్సిన కథలు సుబ్బారావు రాసారు అని వివరించారు వేదిక పై ప్రచురణ కర్త జ్యోతి సాహితీ స్రవంతి(కాకినాడ) అధ్యక్షడు మార్ని జానకీరామయ తదితరులు అభినందన తెలుపగా పెద్దూరి వెంకట దాసు సభా నిర్వహణ చేశారు తొలుత లలితా వాణి నిర్వహణలో విజయ సాధన అంశం పై కవి సమ్మేళనం జరిగింది

Also read