Saturday17 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
भाषाएँ

Latest News

రవీంద్రభారతిలో ఘనంగా ‘వేపకాయల బతుకమ్మ’ ఆడిపాడిన బీసీ సంఘం, నర్సింగ్ అసోసియేషన్ మహిళలు

nagendra17 October 2026, 4:17 AM0 व्यूtrinetnews.com
రవీంద్రభారతిలో ఘనంగా ‘వేపకాయల బతుకమ్మ’ ఆడిపాడిన బీసీ సంఘం, నర్సింగ్ అసోసియేషన్ మహిళలు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16:

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ‘వేపకాయల బతుకమ్మ’ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు.

వేడుకలకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతితో మమేకమయ్యే ఈ వేడుక విశిష్టతను కొనియాడారు.

రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సతీమణి సుజన ప్రత్యేకంగా పాల్గొన్నారు. బీసీ సంఘం, నర్సింగ్ అసోసియేషన్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు.

వేపకాయల ఆకారంలో తయారు చేసిన ముద్దలను నైవేద్యంగా సమర్పించారు. మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, శాఖ సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

यह भी पढ़ें