శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

జిల్లా ప్రజలకు మేలు చేయని సీఎం కూర్చీ ఎందుకు -ఎంపీ డీకే అరుణ

nagendra17 October 2026, 4:11 AM0 చూసులుtrinetnews.com
జిల్లా ప్రజలకు మేలు చేయని సీఎం కూర్చీ ఎందుకు -ఎంపీ డీకే అరుణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  1. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16:

  2. పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టేలా డిండికి పాలమూరు లిఫ్ట్ నీటిని తరలించాలని చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు.శుక్రవారం

పాలమూరు- రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్ట్‌లపై భారతీయ జనతా పార్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మేలు చేయని సీఎం కూర్చీ రేవంత్ రెడ్డికి ఎందుకని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పు వల్ల మోసం జరుగుతుందని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్.. ఆర్డీఎస్‌కు చేసిందేమీ లేదని ఎంపీ విమర్శించారు. పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని.. లేదంటే జిల్లాలో పెద్దఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి