సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,32,429/10g+0.82%
భాషలు

తాజా వార్తలు

నౌకాదళంలోకి తొలి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక ‘ఐఎన్‌ఎస్‌ సమర్థక్‌’ కార్వార్‌లో జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌

nagendra17 October 2026, 4:00 AM4 చూసులుtrinetnews.com
నౌకాదళంలోకి తొలి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక ‘ఐఎన్‌ఎస్‌ సమర్థక్‌’ కార్వార్‌లో జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • కార్వార్‌, ట్రైనెట్ న్యూస్‌, అక్టోబర్‌ 16:

భారత నౌకాదళంలో తొలి స్వదేశీ బహుళ ప్రయోజన నౌక ‘ఐఎన్‌ఎస్‌ సమర్థక్‌’ శుక్రవారం సేవల్లోకి ప్రవేశించింది. కర్ణాటకలోని కార్వార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ ఈ నౌకను జాతికి అంకితం చేశారు. రక్షణ తయారీ రంగంలో స్వావలంబన సాధనకు, అధునాతన స్వదేశీ నౌకాదళ సామర్థ్యాల అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలిచింది.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలతో రూపొందిన ఐఎన్‌ఎస్‌ సమర్థక్‌ దేశ రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత సముద్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నౌకాదళం నిరంతరం అప్రమత్తంగా, యుద్ధ సన్నద్ధతతో ఉందని పేర్కొన్నారు.

దేశీయ ప్రైవేటు నౌకా నిర్మాణ పరిశ్రమ విస్తరిస్తున్న పాత్రకు ఐఎన్‌ఎస్‌ సమర్థక్‌ నిదర్శనమని రాధాకృష్ణన్‌ తెలిపారు. భారత ఘనమైన సముద్ర వారసత్వంతోపాటు భవిష్యత్‌ సముద్ర శక్తికి కార్వార్‌ ప్రతీకగా నిలుస్తోందని అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య