Saturday17 October 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g-0.23%
भाषाएँ

Latest News

అభిమానుల సమక్షంలో సాయి తేజ్ పుట్టినరోజు వేడుకలు — రోడ్డు భద్రత, మహిళల గౌరవం, భవిష్యత్తుపై సుప్రీమ్ హీరో హితవు

nagendra17 October 2026, 3:49 AM0 व्यूtrinetnews.com
అభిమానుల సమక్షంలో సాయి తేజ్ పుట్టినరోజు వేడుకలు — రోడ్డు భద్రత, మహిళల గౌరవం, భవిష్యత్తుపై సుప్రీమ్ హీరో హితవు

Share this story

Share link keeps your language (?lang=)

సుప్రీమ్ హీరో సాయి తేజ్ తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అభిమానుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు, ప్రేమకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేదికగా ఆయన అభిమానులను ఉద్దేశించి పలు కీలక అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరికీ ముఖ్యమని గుర్తు చేస్తూ అందరితో కలిసి "హెల్మెట్ పెట్టుకోవాలి" అని నినదింపజేశారు. అలాగే మహిళలను, హీరోయిన్లను కించపరిచేలా మాట్లాడకూడదని, ఇంటి ఆడపడుచులను ఎలా గౌరవిస్తామో సమాజంలో మహిళలను కూడా అంతే మర్యాదగా చూడాలని, అప్పుడే మన గౌరవం పెరుగుతుందని పిలుపునిచ్చారు.

అభిమానుల భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూ — "సినిమాల్లో హిట్లు, ఫ్లాపులు సహజం, కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దయచేసి కెరీర్‌పై దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి. మీ ప్రేమాభిమానాలతో మేం కష్టపడి సినిమాలు హిట్ చేసుకుంటాం, కానీ మీరు జీవితంలో సక్సెస్ సాధిస్తేనే మాకు అసలైన గర్వం" అని పేర్కొన్నారు.

తన తదుపరి ప్రాజెక్ట్ గురించి చెబుతూ, త్వరలోనే మంచి ఎమోషన్స్, కుటుంబ బంధాలతో కూడిన పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం అభిమానుల పూలమాలలు, సన్మానాలు స్వీకరించి, కేక్ కట్ చేసి వారితో ఫోటోలు దిగారు.

यह भी पढ़ें