శుక్రవారం16 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,630+3.76%
NIFTY23,101+3.30%
22K₹1,36,883/10g+0.09%
భాషలు

తాజా వార్తలు

ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరానికి విశేష స్పందన.... - కవిత పృథ్వీరాజ్, అడపా చంద్రమౌళిలు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినం దనీయం...

nagendra16 October 2026, 4:59 AM0 చూసులుtrinetnews.com
ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరానికి విశేష స్పందన.... - కవిత పృథ్వీరాజ్, అడపా చంద్రమౌళిలు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినం దనీయం...

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 15 :

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినో త్సవాన్ని పురస్కరిం చుకొని సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట శివంరోడ్డులోని ఎన్ఎస్.టిఐ క్యాంపస్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మ హిళా మోర్చా అధికార ప్రతినిధి నలువాల కవిత పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్ర మౌళి సంయుక్త ఆధ్వ ర్యంలో నిర్వహిం చిన వైద్య శిబిరానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, సెం ట్రల్ జిల్లా బిజెపి ప్రధాన కా ర్యదర్శి ఏడెల్లి అజ య్ కుమార్ లు హాజరయ్యారు. శ్రీకర హాస్పిటల్స్ పలువురు వైద్యు లు హాజరై హెల్త్ క్యాంప్ లో బీపీ, షుగర్, చెకప్, గైనిక్, కంటి, దంత, యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, ఈసీ జీ, తదితర పరీక్షలు నిర్వహించారు. ఎన్ఎస్.టిఐ శిక్షణ పొందు తున్న విద్యా ర్థిని, విద్యార్థులు, ఉద్యోగులు, పలువురి పేద ప్రజలకు.. 520 మందికి వైద్య పరీక్ష లు నిర్వ హించి అవసరమైన ఉచితంగా మందులు అందజే శారు. పలువురు ప్రముఖులు, యువత ఉత్సాహం గా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం గౌతమ్ రావు మాట్లాడుతూ... పేద మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందిం చాలనే ఉ ద్దేశంతో వైద్య శిబిరం ఏర్పా టు చేయడం గొప్ప విషయం అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని యువత సామాజిక సేవలో భాగస్వా ములు కావాలని ఆయన పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన కవిత పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళిని శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్ర మంలో బాగ్ అంబర్ పేట డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు కనకలక్ష్మీ, బిజెపి నేతలు ఆర్. రాంరెడ్డి, అడపా జనార్ధన్, పృథ్వీరాజ్, ఎన్ఎస్.టిఐ అధి కారులు, ఉద్యోగుల సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్చంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి