శుక్రవారం16 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,630+3.76%
NIFTY23,101+3.30%
22K₹1,36,883/10g+0.09%
భాషలు

తాజా వార్తలు

పోలవరం పై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు వంటల వరకు సమావేశం- వివిధ అంశాలపై సమీక్ష

nagendra16 October 2026, 4:58 AM0 చూసులుtrinetnews.com
పోలవరం పై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు వంటల వరకు సమావేశం- వివిధ అంశాలపై సమీక్ష

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

డిజైన్ల ప్రకారమే నిర్మాణాలు ఉన్నాయన్న నిపుణులు

పోలవరం, ట్రైనెట్ న్యూస్

అక్టోబర్ 15: పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈ సి ఆర్ ఎఫ్ ) డ్యామ్ నిర్మాణం పై అంతర్జాతీయ నిపుణులు గురువారం సమీక్షించారు. కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన జరిగింది.కేంద్ర జలసంఘం డిజైన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ సరబ్జిత్‌ సింగ్‌ బక్షి, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, ఉప సంచాలకుడు ఏ. ప్రవీణ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేష్‌కుమార్‌, సహాయ సంచాలకుడు సీహెచ్‌ సంజీవ్‌, నేషనల్‌ వాటర్‌ సిస్టం డైరెక్టర్‌ పన్నీర్‌ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్‌ గౌతమ్‌ , సిఎస్ఎంఆర్ ఎస్ శాస్త్రవేత్తలు షాహిద్‌ నూర్‌, ఎం.కె. బాషా, ఉదయ్‌ భాను చక్రబోర్తి, వ్యాప్కోస్‌ జనరల్‌ మేనేజర్‌ కేపీఎస్‌ త్యాగీ, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, చీఫ్‌ ఇంజినీర్‌ కె. శేషుబాబు, ఎస్‌ఈలు పి. రామచంద్రరావు, డి. తిరుమలరావు, ఈఈలు డి. శ్రీనివాస్‌, ప్రేమ్‌చంద్‌, కె. బాలకృష్ణమూర్తి, ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీ గంగాధర్‌కుమార్‌, డీజీఎం మురళి పమ్మి, కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ చంద్‌ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ లో క్షేత్రస్థాయిలో పనులను కొద్దిసేపు పరిశీలించారు. సమీక్ష సందర్భంగా డిజైన్లకు సంబంధించి అఫ్రీ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ పరికరాల్లో పనుల్లో ఏమైనా తేడా ఉంటె నమోదు అవుతుంది. ఆ పరికరాలు నమోదు చేసిన రికార్డులను అంతర్జాతీయ నిపుణులకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అంద చేశారు. వాటిని పరిశీలించిన అధికారులు ఎలాంటి తేడాలు లేవని నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జి హిల్, జి డ్యాష్ హిల్ ల వద్ద జరుగుతున్నగ్రౌటింగ్ పనులపై సమీక్షించిన నిపుణులు తమ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి