శుక్రవారం16 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,630+3.76%
NIFTY23,101+3.30%
22K₹1,36,883/10g+0.09%
భాషలు

తాజా వార్తలు

కలాం జీవితాన్ని ఆదర్శం గా గ్రహించాలి

nagendra16 October 2026, 4:54 AM0 చూసులుtrinetnews.com
కలాం జీవితాన్ని ఆదర్శం గా గ్రహించాలి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 15:

అబ్దుల్ కలాం చిన్న నాటి నుంచి విద్య పట్ల ఆసక్తి తో పాటు చదువు పూర్తి చేసుకోవాలన్న తపన తో పేపర్ బాయ్ వంటి పనులు కూడా చేస్తూ తను అనుకున్న అంతరిక్ష రంగం లో ఉన్నత స్థాయి కి చేరారు అని రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు నాయుడు సత్యనారాయణ చెప్పారు ప్రతి ఒక్కరూ తమ రంగం లో ఉన్నత స్థాయి చేరేందుకు కలాం జీవితాన్ని ఆదర్శం గా తీసుకోవాలి అని అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జన్మ దినోత్సవం గాన సభ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ కలాం భారత దేశ అత్యున్నత పదవి రాష్ట్ర పతి గా వున్న సమయం లోనూ అతి నిరాడంబర జీవితం నిస్వార్థ సేవ దృక్పథం తో గడిపిన మహావ్యక్తి అని కొని యాడారు ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత తన కి ఇష్టం ఇన బోధనా రంగాన్ని ఎంచుకొని ఆ క్రమంలో ప్రసంగిస్తూ మృతి చెందటం తో దేశం ఒక గొప్ప శాస్త్రవేత్త ను కోల్పోయింది అని అన్నారు గాన సభ ఆయన జయంతి నాడే కార్యక్రమం జరిపి కలాం పై వారికున్న అభిమానం చూపారు అని అభినందించారు గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై గాయకుడు వెన్నెల సుబ్రహ్మణ్యం గాన సభ సభ్యురాలు దేవ సేన బాల సాహిత్య రచయిత చొక్కాపూ రమణ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి