Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,662+3.81%
NIFTY23,124+3.40%
HYD 22K₹1,37,152/10g+0.38%
भाषाएँ

Latest News

అండర్‌–13 విభాగంలో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ చిన్నారులు

nagendra16 October 2026, 4:53 AM0 व्यूtrinetnews.com
అండర్‌–13 విభాగంలో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ చిన్నారులు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ : ఇటీవల బీహార్‌లోని పాట్నాలో అక్టోబర్ 10 నుంచి 15 వరకు జరిగిన అండర్‌–13 ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచారు. భవనాసి సాన్వి, దేవరం శ్రీనిధి బాలికల డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత సాధించగా, లట్టాల సాన్వి సింగిల్స్, డబుల్స్ రెండు విభాగాల్లోనూ మెయిన్ డ్రాలో స్థానం సంపాదించింది.

జాతీయ స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో మ్యాచ్ పాయింట్ క్రీడాకారిణులు సాధించిన విజయాలు అకాడమీకి గర్వకారణంగా నిలిచాయని

మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకుడు చైర్మన్, ప్రధాన కోచ్ వేణు ముప్పాల తెలిపారు. చిన్న వయసులోనే ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు .

క్రీడాకారిణులు మరింత కష్టపడి సాధన చేస్తూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

यह भी पढ़ें