Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,691+3.85%
NIFTY23,113+3.35%
HYD 22K₹1,37,225/10g+0.42%
भाषाएँ

Latest News

కరువు ముప్పు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సమీక్ష

nagendra16 October 2026, 4:51 AM0 व्यूtrinetnews.com
కరువు ముప్పు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సమీక్ష

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15: రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో

పరిస్థితులు, కరువు ముప్పు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో, వర్షాభావ పరిస్థితులపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 320 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. అందులోనూ 117 మండలాల్లో తీవ్రమైన కరువు తాండవిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం సలహాదారు రామకృష్ణారావు ఎల్న్ని తీవ్రత, దాని వల్ల కలిగే ప్రభావాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎల్న్ని ప్రభావాన్ని తగ్గించేందుకు గాను డీప్యటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటీ కరువు పరిస్థితులను అధిగమించేందుకు, తాగునీరు, సాగునీరు, పంట నష్టాల నివారణకు సమగ్రమైన 'రోడ్ మ్యాప్' సిద్ధం చేయనుంది. కేబినెట్ సబ్ కమిటీ తన తొలీ సమావేశాన్ని రేపు (శుక్రవారం) నిర్వహించనుంది. మరోవైపు ఇప్పటికే ఎల్న్ని ప్రభావంతో రాష్ట్రంలో 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ యంత్రాంగం తేల్చింది. ఈ నష్టానికి సంబంధించి ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం రూ.1,118 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ అంచనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పంటనష్టం, తాగునీరు, సాగునీటి లభ్యతపై ప్రభుత్వ యంత్రాంగం సమగ్ర నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అధికారులు సమర్పించారు.

यह भी पढ़ें