సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,32,416/10g+0.81%
భాషలు

తాజా వార్తలు

కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి కటాక్షం భక్తిభావంతో పరవశించిన తిరుమల.. భజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ

nagendra16 October 2026, 4:47 AM2 చూసులుtrinetnews.com
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి కటాక్షం భక్తిభావంతో పరవశించిన తిరుమల.. భజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారి కృపాకటాక్షాలు పొందారు.

కల్పవృక్ష వాహనం – కోరిన కోర్కెలు తీర్చే దివ్య వైభవం

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పురాణాలు పేర్కొంటాయి. అటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులకు ఐహిక శుభాలు, సకలాభీష్టాల ప్రాప్తికి ప్రతీకగా నిలుస్తుంది.

రాత్రి సర్వభూపాల వాహనసేవ

గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈఓ విద్యా, ఆరోగ్యం గోపీనాథ్, సీవీఎస్‌వో శ్మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య