Thursday15 October 2026హైదరాబాద్

SENSEX73,814+1.85%
NIFTY22,932+1.83%
HYD 22K₹1,35,840/10g-0.57%
भाषाएँ

Latest News

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

nagendra15 October 2026, 2:34 AM0 व्यूtrinetnews.com
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Share this story

Share link keeps your language (?lang=)

విజయవాడ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఆలయ మర్యాదల ప్రకారం రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రాష్ట్రపతికి ఆశీర్వచనం అందించారు.

అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు పూర్తయిన అనంతరం ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రి నుంచి తన కాన్వాయ్‌లో బయలుదేరారు.

यह भी पढ़ें