Thursday15 October 2026హైదరాబాద్

SENSEX73,299+1.14%
NIFTY22,783+1.16%
HYD 22K₹1,35,782/10g-0.62%
भाषाएँ

Latest News

రవీంద్రభారతిలో ఐదవ రోజు 'అట్ల బతుకమ్మ' వేడుకలు తెలంగాణ మహిళల జీవన విధానాన్ని ప్రతిబింబించేదే బతుకమ్మ : డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

nagendra15 October 2026, 2:34 AM0 व्यूtrinetnews.com
రవీంద్రభారతిలో ఐదవ రోజు 'అట్ల బతుకమ్మ' వేడుకలు తెలంగాణ మహిళల జీవన విధానాన్ని ప్రతిబింబించేదే బతుకమ్మ : డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ అక్టోబర్ 14 :

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో భాగంగా రవీంద్రభారతిలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ అత్యంత వైభవంగా సాగాయి. ఈ వేడుకల్లో సావిత్రిబాయి ఫూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు, కళాకారులు పాల్గొని వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ, సాంప్రదాయ పాటలతో ఆడిపాడారు. కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు సంతోషంగా, ఐక్యతతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ జీవన విధానానికి, సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. ప్రకృతిని, దైవాన్ని ఒక్కటిగా చూసే ఈ ఆచారం మన సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. అట్లు (దోసెలు) నైవేద్యంగా సమర్పించే ఐదవ రోజు సంబరాల్లో మహిళలతో పాటు చిన్నారులు, వివిధ రంగాలకు చెందిన కళాకారులు ఉత్సాహంగా పాల్గొని భక్తిశ్రద్ధల మధ్య వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

यह भी पढ़ें