గురువారం15 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,782+0.43%
NIFTY22,742+0.98%
22K₹1,36,019/10g-1.07%
భాషలు

తాజా వార్తలు

ప్రపంచ టెలికాం ప్రమాణాల రూపకల్పనలో భారత్ కీలక పాత్ర టీఈసీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

nagendra15 October 2026, 2:26 AM0 చూసులుtrinetnews.com
ప్రపంచ టెలికాం ప్రమాణాల రూపకల్పనలో భారత్ కీలక పాత్ర టీఈసీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

ప్రపంచ టెలికమ్యూనికేషన్ ప్రమాణాల రూపకల్పనలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్ (టీఈసీ) ఆధ్వర్యంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం–2026 నిర్వహించారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని టెలికమ్యూనికేషన్ల విభాగం పరిధిలో పనిచేస్తున్న టీఈసీ, న్యూఢిల్లీలోని తన కార్యాలయ మానక్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

టెలికాం ప్రమాణాల రూపకల్పన, దేశీయ సాంకేతిక స్వావలంబన సాధన, అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థలకు తోడ్పాటు అందించడంలో టీఈసీ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్‌కు చెందిన ప్రమాణీకరణ విభాగం (ఐటీయూ–టీ) కార్యకలాపాల్లో భారత్ చురుగ్గా భాగస్వామ్యం అవుతోందని తెలిపారు.

596 ప్రమాణాలు.. 5,400కు పైగా ధ్రువపత్రాలు

టెలికమ్యూనికేషన్ల ప్రమాణాల ప్రకటన, అనుగుణత అంచనా, ధ్రువీకరణకు సంబంధించిన 2025 నిబంధనల ప్రకారం టీఈసీ ప్రమాణాలను రూపొందించడంతోపాటు అనుగుణత అంచనా సంస్థలకు (సీఏబీలు) గుర్తింపు ఇచ్చి, ధ్రువపత్రాలను జారీ చేస్తోంది. వివిధ సాంకేతిక విభాగాల్లో అవసరమైన నిబంధనలు, సాధారణ అవసరాలు, పరీక్షా మార్గదర్శకాలు, ప్రమాణ పత్రాలతో కలిపి ఇప్పటివరకు 596 ప్రమాణాలను విడుదల చేసింది. 82 అనుగుణత అంచనా సంస్థలను నియమించడంతోపాటు 5,400కు పైగా ధ్రువపత్రాలను జారీ చేసింది.

ఈ సందర్భంగా టీఈసీ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, అధిపతి సయ్యద్ తౌసీఫ్ అబ్బాస్ మాట్లాడుతూ, వివిధ ఐటీయూ–టీ అధ్యయన బృందాల్లో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఈసీ అధికారుల కృషిని ప్రశంసించారు.

టీఈసీ రూపొందిస్తున్న పటిష్ఠమైన జాతీయ ప్రమాణాలు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు నెట్‌వర్క్ భద్రత, వివిధ వ్యవస్థలు పరస్పరం అనుసంధానమై పనిచేసే సామర్థ్యం, సేవల నాణ్యతను నిర్ధారిస్తున్నాయని పేర్కొన్నారు. భారత డిజిటల్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఇవి దోహదపడుతున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి