Thursday15 October 2026Hyderabad

SENSEX73,771+1.79%
NIFTY22,904+1.70%
HYD 22K₹1,35,806/10g-0.59%
Languages

Latest News

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు తరలిరండి ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కండి

nagendra15 October 2026, 2:23 AM0 viewstrinetnews.com
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు తరలిరండి ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కండి

Share this story

Share link keeps your language (?lang=)

* ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ – 2026’లో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

“తెలంగాణ రైజింగ్ - 2047” విజన్ కు అనుగుణంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026’లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి... ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ – 2026’కు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి సారించామన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించేలా పరిశ్రమలు, నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఐటీ, సాంకేతిక రంగాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ తయారీ రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఏఐ, ఏరోస్పేస్, రక్షణ రంగం, అధునాతన తయారీ లాంటి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలను విస్తరించేందుకు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

Also read