Thursday15 October 2026హైదరాబాద్

SENSEX73,728+1.73%
NIFTY22,917+1.76%
HYD 22K₹1,35,820/10g-0.58%
भाषाएँ

Latest News

సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

nagendra15 October 2026, 2:22 AM0 व्यूtrinetnews.com
సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి నేతృత్వంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా పూలను పూజించే గొప్ప సాంప్రదాయం మన తెలంగాణలో ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అత్యంత కీలక పాత్ర వహించే సచివాలయ ఉద్యోగులు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు అనంతరం సచివాలయ మహిళా ఉద్యోగులు అధికారులు తమ కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

यह भी पढ़ें