గురువారం15 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,997+0.72%
NIFTY22,741+0.98%
22K₹1,35,845/10g-0.58%
భాషలు

తాజా వార్తలు

విజయనగరం జిల్లాకు జల’వరం’విజయనగరం జిల్లాకు జల’వరం’

nagendra15 October 2026, 2:10 AM0 చూసులుtrinetnews.com
విజయనగరం జిల్లాకు జల’వరం’విజయనగరం జిల్లాకు జల’వరం’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* 454 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు నిధుల విడుదల

* వందలాది గ్రామాలకు తీరనున్న సాగు, తాగునీటి కష్టాలు

* వి బి జి రామ్ జి పథకం నుంచి రూ. 22.14 కోట్లతో పనులు

* విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వినతులను పరిశీలించి పనులకు ఆదేశించిన ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్

  1. విజయనగరం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

విజయనగరం జిల్లా తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే నిమిత్తం వెంటనే చేయాల్సిన పనులపై ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయానికి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వివిధ వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 22.14 కోట్లతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి విబిజి రామ్ జి పథకం (వీబీ -జీ రామ్ జీ )లో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ. 205.69 కోట్లు జిల్లాకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి జిల్లాలో మొత్తం 454 చెరువులకు జీవం పోయనున్నారు. చెరువుల్లో పూడిక తొలగించి, పునరుద్ధరణ చేయడంతోపాటు నీరు సరఫరా అయ్యే కాలువలు పునరుద్ధరణ, స్లూయిస్ గేట్లకు మరమ్మతులు చేయనున్నారు. 454 చెరువులకు సరికొత్త కళ తెచ్చేలా ఈ పనులు వెంటనే మొదలు కానున్నాయి. ఈ పనుల వల్ల విజయనగరం జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగు, సాగునీటి కొరత తీరుతుంది.

ఇవి కూడా చదవండి