నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
పేరూరు: గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి పూజ, అభిషేకం, కుంకుమార్చన, హోమ కార్యక్రమాలను అర్చకులు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన ఉపాధ్యక్షులు కొండూరు శోభన్ బాబు, ధర్మపత్రి లక్ష్మీప్రసన్న, కార్తీక్, ముఖేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కనకదుర్గమ్మ అనుగ్రహం పొందేందుకు గ్రామానికి చెందిన 17 మంది భక్తులు మాలధారణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పశువుల ప్రసాద్, బైరబోని శంకర్, గుండెగోని అంజయ్య, బుయ్య మధు, బైరు మహేందర్, మహి కోటయ్య, సందీప్, దారం లింగయ్య, కాళ్ల సైదులు, మణి, అశోక్, పవన్ తదితర భక్తులు పాల్గొన్నారు.





