సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,32,474/10g+0.85%
భాషలు

తాజా వార్తలు

చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం

nagendra14 October 2026, 1:32 AM1 చూసులుtrinetnews.com
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

గోవింద నామస్మరణలు.. మంగళవాయిద్యాలు.. కోలాటాల నడుమ వైభవంగా వాహనసేవ

తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ముందుగా గజాలు, అశ్వాలు నడుస్తుండగా, భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనల నడుమ వాహనసేవ కన్నులపండువగా సాగింది. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.

చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక

వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడిని ‘శేషి’గా, ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే చిన్నశేష వాహనం ఈ శేషి భావాన్ని చాటిచెబుతుంది. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య