బుధవారం14 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,034+0.54%
NIFTY22,722+0.53%
22K₹1,36,626/10g+0.78%
భాషలు

తాజా వార్తలు

మణికుమార్ క్రికెట్ క్లబ్‌కు ఘన విజయం హర్షవర్ధన్ అజేయంగా 82 పరుగులు.. శేఖర్ బాబు, ప్రతీక్‌కు మూడేసి వికెట్లు

nagendra14 October 2026, 1:21 AM0 చూసులుtrinetnews.com
మణికుమార్ క్రికెట్ క్లబ్‌కు ఘన విజయం హర్షవర్ధన్ అజేయంగా 82 పరుగులు.. శేఖర్ బాబు, ప్రతీక్‌కు మూడేసి వికెట్లు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్:

  • హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్‌లో మణికుమార్ క్రికెట్ క్లబ్ ఆరు వికెట్ల తేడాతో షాలిమార్ క్రికెట్ క్లబ్‌పై ఘన విజయం సాధించింది. అంబర్‌పేటలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చతుర్వేదుల రవితేజ్ సారథ్యంలోని మణికుమార్ జట్టు బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సత్తా చాటింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మణికుమార్ జట్టు ప్రత్యర్థిని 38.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ చేసింది. కనుకుంట్ల శేఖర్ బాబు 10 ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు, ప్రతీక్ రాజనేని ఏడు ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. రామేశ్వరం హర్షిత్ 10 ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు, వేదస్ వురాడి 7.3 ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించారు.

అనంతరం 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణికుమార్ జట్టు కేవలం 12.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. డి. హర్షవర్ధన్ 41 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సమష్టిగా రాణించిన ఆటగాళ్లను మణికుమార్ క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రియదర్శిని ప్రాతూరి, కార్యదర్శి కృష్ణ చతుర్వేదుల అభినందించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కిరీటి చతుర్వేదుల జ్ఞాపికలు, పతకాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి