Monday12 October 2026Hyderabad

SENSEX72,305-1.04%
NIFTY22,498-1.22%
HYD 22K₹1,38,702/10g+1.96%
Languages

Latest News

ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

nagendra12 October 2026, 2:37 AM0 viewstrinetnews.com
ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

  • ఖమ్మం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చడం కూడా సవాలుగా మారే అవకాశం ఉందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులకు ఎలాగైనా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని పొంగులేటి తెలిపారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చని అన్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు ప్రజల తాగునీటి అవసరాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యుత్ వినియోగంపైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకే విద్యుత్‌ను ఉపయోగిస్తూ పొదుపు పాటించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు.. విద్యుత్‌ను బాధ్యతాయుతంగా వినియోగించడం అందరి బాధ్యత అని మంత్రి పొంగులేటి చెప్పారు.

Also read