Monday12 October 2026హైదరాబాద్

SENSEX72,162-1.24%
NIFTY22,422-1.55%
HYD 22K₹1,38,432/10g+1.68%
भाषाएँ

Latest News

మహాశక్తి’ ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం తొలిరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

nagendra12 October 2026, 2:33 AM0 व्यूtrinetnews.com
మహాశక్తి’ ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం తొలిరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

Share this story

Share link keeps your language (?lang=)

ధ్వజరోహణ మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్*

కరీంనగర్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:

కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయ దశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఆలయాన్ని పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. నవరాత్రుల తొలిరోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి (శైలపుత్రి) రూపంలో సూర్యప్రభ అలకంరణ చేశారు. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం శక్తి, జ్ఞానం, ధైర్యం, నిర్మలత్వానికి ప్రతీక. శరన్నవరాత్రుల ఆరంభంలో ఈ బాలరూపాన్ని ఆరాధించడం ద్వారా దైవభక్తితోపాటు మంచి విలువలను జీవితంలో ఆచరించాలనేది సందేశం. బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన మనిషిలోని నిర్మలత్వాన్ని మేల్కొలిపి, జ్ఞానమార్గంలో నడిపిస్తుందని భక్తుల విశ్వాసం. దుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వడం భక్తులకు కనువిందు చేసింది. తొలిరోజు వేలాది భక్తులతో శ్రీ మహాశక్తి దేవాలయం కిటకిటలాడింది. ఉదయం 11 గంటలకు ధ్వజరోహణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాన్ని దర్శించుకున్న వేలాది మంది భక్తులు, ముఖ్యంగా భవానీ దీక్షాపరులకు ఆలయ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందించారు. నవరాత్రులు ముగిసే వరకు భోజనం, అల్పాహారం అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

మరోవైపు ఈరోజు నుండి నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ ‘శ్రీ భాగవత వైభవం’పై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. అట్లాగే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అధ్యాత్మిక భావన, భక్తి పాటలతో తెలంగాణ సంస్క్రుతి ఉట్టిపడేలా ‘‘దాండియా’’ కార్యక్రమం నిర్వహించనున్నారు.

यह भी पढ़ें