సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,593+0.17%
22K₹1,39,147/10g+1.01%
భాషలు

తాజా వార్తలు

గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం బీజేపీ పాలనలో డ్రగ్స్, భూ మాఫియా పెరిగిపోయాయి

nagendra12 October 2026, 2:32 AM0 చూసులుtrinetnews.com
గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం బీజేపీ పాలనలో డ్రగ్స్, భూ మాఫియా పెరిగిపోయాయి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పేదలు, దళితులు, మైనారిటీల ఓట్లు తొలగించే కుట్ర: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

గోవా, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11: 2027లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో గోవా ప్రజలు విసిగిపోయారని, మరోసారి ఆ పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలోని భూములు, ఆస్తులు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విమర్శించారు. గోవాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ప్రతినిధిగా తాను గోవాకు వచ్చానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిరసన కార్యక్రమాల కారణంగా రాహుల్ గాంధీ రాలేకపోయారని చెప్పారు.

బీజేపీ ప్రభుత్వ హయాంలో గోవా డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని, యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్ర అభివృద్ధి కంటే ఆస్తులను ఇతరులకు అప్పగించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. డ్రగ్స్ మాఫియా, భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది

జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడితే, ప్రధాని మోదీ ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీని రావణుడితో, కాంగ్రెస్‌ను రాముడితో పోల్చిన ఆయన.. బీజేపీని ఓడించేందుకు గోవా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, 2027లో గోవాలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవా నుంచి ప్రారంభమయ్యే రాజకీయ మార్పు దేశవ్యాప్తంగా విస్తరించి, ఢిల్లీలో ఎర్రకోటపై కాంగ్రెస్ త్రివర్ణ పతాకం ఎగురవేసే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి