సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,593+0.17%
22K₹1,39,147/10g+1.01%
భాషలు

తాజా వార్తలు

‘కాస్ట్’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

nagendra12 October 2026, 2:19 AM0 చూసులుtrinetnews.com
‘కాస్ట్’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేష్, రవి సోషల్ డ్రామా ‘కాస్ట్’(Caste) ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ టీజర్ లాంచ్

వరుణ్ సందేశ్, గగన్ బాబు , సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా ‘కాస్ట్’. ఏకే జంపన్న రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. కశిక కపూర్, దివి వద్యా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన చిత్ర బృందం తాజాగా ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ టీజర్‌ను లాంచ్ చేసింది.

కుల వివక్ష అనే ప్రధాన ఇతివృత్తాన్ని పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. అగ్రకులానికి చెందిన వారి ఇంట్లోకి తమకు ప్రవేశం లేదని ఓ తండ్రి తన కొడుకుకు చెప్పే సన్నివేశంతో కథలోని సామాజిక అంశాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించే ఓ పోలీస్ అధికారి పాత్రను చూపించారు. గ్రామంలో వరుసగా జరిగే దారుణ హత్యలతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. వరుణ్ సందేశ్, సత్యం రాజేశ్, నాగబాబు, రాజా రవీంద్ర, యాంకర్ రవి, దివి వద్యా పోషిస్తున్న కీలక పాత్రల తాలూకు గ్లింప్స్ టీజర్‌లో ఆకట్టుకున్నాయి.

దర్శకుడు ఏకే జంపన్న సున్నితమైన సామాజిక అంశాన్ని ఎంచుకుని, దానికి డ్రామా జోడిస్తూ ఆసక్తికరమైన సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కథను ముందుకు నడిపించడంలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది.

వరుణ్ సందేశ్ తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకోగా, పోలీస్ అధికారి పాత్రలో గగన్ బాబు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సత్యం రాజేశ్ తన పాత్రతో ఆసక్తిని

ఇవి కూడా చదవండి