నిర్మాత శరత్ మరార్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కమల్ హాసన్ నటించిన స్టైలిష్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’కు దర్శకత్వం వహించిన రాజేష్ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
విభిన్నమైన పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకునే సత్యదేవ్.. ఈ సిరీస్ లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథకు మరింత ఇంటెన్స్సిటీ తీసుకురానున్నారు. ఫరియా అబ్దుల్లా కూడా ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సిరీస్‌లో విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్ రాజ్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, రాజేష్ సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ట్రయల్ అండ్ ఎర్రర్’.. ప్రతిభావంతులైన నటీనటుల కలయికతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు: సత్యదేవ్, రమ్యకృష్ణ, ఫరియా అబ్దుల్లా, విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్ రాజ్, సుబ్బరాజు
సాంకేతిక బృందం:
నిర్మాత: శరత్ మరార్
బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
రచన, దర్శకత్వం: రాజేష్ సెల్వ
పీఆర్వో: వంశీ-శేఖర్
GSC00970.jpg.jpeg
GSC00992.JPG.jpeg
Best regards,
PRO: Vamsi - Shekar
Contact: +91 9581799555 - +91 9949994977








