సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,32,765/10g+1.08%
భాషలు

తాజా వార్తలు

రవీంద్రభారతిలో సందడిగా అటుకుల బతుకమ్మ వేడుకలు రెండో రోజు ఆడిపాడిన మహిళలు, దివ్యాంగులు, చిన్నారులు

nagendra12 October 2026, 2:16 AM1 చూసులుtrinetnews.com
రవీంద్రభారతిలో సందడిగా అటుకుల బతుకమ్మ వేడుకలు రెండో రోజు ఆడిపాడిన మహిళలు, దివ్యాంగులు, చిన్నారులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • హైదరాబాద్, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్):

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు రెండో రోజు ఆదివారం రవీంద్రభారతిలో సందడిగా సాగాయి. అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఆడిపాడారు.

జాతీయ అవార్డు గ్రహీత పద్మావతి నేతృత్వంలోని దివ్యాంగుల బృందం ఉత్సాహంగా పాల్గొంది. అలేఖ్య సంస్థ ఆధ్వర్యంలో సుమారు వంద మంది మహిళలు, విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. మహిళలు, దివ్యాంగులు, కళాకారుల భాగస్వామ్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని కార్యక్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందన్నారు.

కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సహాయ సంచాలకులు పి. నర్సింహులు, పరిపాలన అధికారి డాక్టర్ పి. విజయకుమార్, సూపరింటెండెంట్ జె. శ్రీనివాస్, హేమలత, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచర్ల దినకర్, పల్లె నర్సింహా, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య