సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,305-1.04%
NIFTY22,498-1.22%
22K₹1,38,702/10g+1.96%
భాషలు

తాజా వార్తలు

స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఎలగందుల సురేష్‌కు యూనిస్కో కౌన్సిల్ సభ్యులు వెంకటరమణ రావు అదోని మద్దతు

nagendra12 October 2026, 2:03 AM0 చూసులుtrinetnews.com
స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఎలగందుల సురేష్‌కు యూనిస్కో కౌన్సిల్ సభ్యులు వెంకటరమణ రావు అదోని మద్దతు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • నల్గొండ, అక్టోబరు 11 (ట్రైనెట్ న్యూస్):

స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎలగందుల సురేష్‌కు శ్రీ దత్త ఇన్ఫోటెక్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకులు, సీఈఓ అదోని వెంకట రమణ రావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్న సురేష్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నల్గొండకు చెందిన సురేష్‌ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కృషి చేస్తున్నారని వెంకట రమణ రావు పేర్కొన్నారు. విద్యావంతుడిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా వెనుకబడిన వర్గాల సమస్యలు, హక్కులు, అభివృద్ధి అంశాలపై స్పందిస్తున్నారని తెలిపారు.

జర్నలిజంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సురేష్‌ చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయనకు తన మద్దతు ఉంటుందని వెంకట రమణ రావు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి