Sunday11 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించిన సాలూరి రాజేశ్వరరావు: జస్టిస్ భవానీ ప్రసాద్ గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు సాలూరి ప్రతిభా పురస్కారం

nagendra11 October 2026, 1:57 AM0 व्यूtrinetnews.com
సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించిన సాలూరి రాజేశ్వరరావు: జస్టిస్ భవానీ ప్రసాద్ గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు సాలూరి ప్రతిభా పురస్కారం

Share this story

Share link keeps your language (?lang=)

  1. హైదరాబాద్, అక్టోబర్ 10 (ట్రైనెట్ న్యూస్) :

సామాన్యుల నుంచి పండితుల వరకు అందరినీ మైమరపించే పాటలను అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ అన్నారు.

సాలూరి రాజేశ్వరరావు 104వ జయంతి సందర్భంగా సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై సాలూరి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ భవానీ ప్రసాద్ ప్రముఖ గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు పురస్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవీణ్‌కు అసాధారణమైన గాత్రం ఉందని, పద్యాలు, పాటలను అలవోకగా ఆలపించే సామర్థ్యం కలిగిన గాయకుడని అభినందించారు. నేటి సినిమా పాటల్లో అధిక శబ్దాలు, నృత్యాల్లో సర్కస్ విన్యాసాలను పోలిన ప్రదర్శనలు ఉంటున్నాయని విమర్శించారు. శాస్త్రీయ కళల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ, పాటలో తాను లీనమై, శ్రోతలనూ లీనం చేయగల శక్తి ప్రవీణ్ కుమార్‌కు ఉందని కొనియాడారు.

స్వాగత ప్రసంగం చేసిన డాక్టర్ రాము మాట్లాడుతూ, సాలూరి రాజేశ్వరరావు తనను పుత్రసమానుడిగా ఆదరించారని తెలిపారు. ఆయన సంగీత దర్శకత్వంలో తాను వంద గీతాలు రాసినట్లు పేర్కొన్నారు.

తొలుత గాయకులు రమణారెడ్డి, రేవతి రమణ సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన సినిమా పాటలను మధురంగా ఆలపించారు. ఆశాలత కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

यह भी पढ़ें