Sunday11 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+0.70%
Languages

Latest News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల గొంతుకగా నిలుస్తా: జూలూరి మహేష్ గౌడ్

nagendra11 October 2026, 1:48 AM0 viewstrinetnews.com
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల గొంతుకగా నిలుస్తా: జూలూరి మహేష్ గౌడ్

Share this story

Share link keeps your language (?lang=)

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 10 హైదరాబాద్–రంగారెడ్డి–

మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత జూలూరి మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను మండలిలో బలంగా వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా తాను పనిచేస్తానని మహేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు.

ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం మరింత సీరియస్‌గా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగాల కోసం యువత ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే వారికి ఉపాధి అవకాశాల పేరుతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం పట్ల ఆయన విమర్శలు చేశారు. ఇప్పటివరకు గుర్తుకురాని నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారు? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.

Also read