ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+0.70%
భాషలు

తాజా వార్తలు

అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్

nagendra11 October 2026, 1:45 AM0 చూసులుtrinetnews.com
అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

బతుకమ్మ పాటలతో మార్మోగిన ప్రాంగణం*

రంగురంగుల పూలు పేర్చి.. మహిళల ఆటపాటలు

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతా భావానికి ఈ పండుగ నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు. తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప‌ర్యాట‌క శాఖ స్పెష‌ల్ సీఎస్ వాణిప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్‌తోపాటు ప‌లువురు కార్పొరేషన్ చైర్ ప‌ర్స‌న్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి