హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10:
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని.. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు పొందేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఓటరుకు వివరించాలని పార్టీ నాయకులు.. కార్యకర్తలకు సూచించారు.





