Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

nagendra10 October 2026, 2:47 AM0 व्यूtrinetnews.com
11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలాధారణ గావించి ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్ష చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు నుండి 11 రోజుల పాటు బండి సంజయ్ దీక్షలో కొనసాగనున్నారు. ఈ 11 రోజులు పూర్తిగా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో తరించనున్నారు. వివిధ సమస్యల నిమిత్తం కేంద్ర మంత్రిని కలిసేందుకు వచ్చే వారందరినీ ఆలయ ఆవరణలోనే కలుసుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక టెంట్ ఏర్పాటు చేశారు. మరోవైపు దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాశక్తి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ పరిసరాలన్నింటినీ దీప కాంతులతో నింపేశారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక నిర్వహించనున్న ఆధ్మాత్మిక సాంస్ర్కుతిక కార్యక్రమాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుండి మహాశక్తి అమ్మవారు రోజుకో పూజ అందుకోనున్నారు. భారీ ఏర్పాట్ల నేపత్యంలో ఉమ్మడి కరీంనగర్ సహా వివిధ జిల్లాల ప్రజల అడుగులన్నీ కరీంనగర్ లోని ‘‘మహాశక్తి అమ్మవారి ఆలయం’’వైపే పడుతున్నాయి. శుక్రవారం కావడంతో భవానీ దీక్షాధారులు, భక్తులతో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం సందడిగా మారింది.

దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో కర్త, కర్మ, క్రియలా అన్నీ తానై వ్యవహరిస్తూ భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అమ్మవార్లను ప్రశాంతమైన వాతావరణంలో మనస్పూర్తిగా దర్శించుకునేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సకల సౌకర్యాలు కల్పించారు. అంతే కాకుండా భవానీ మాలాధారణ చేసిన దీక్షాపరులకు భోజన, పూజా వసతులను కల్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలను అందజేయనున్నారు. భవానీ మాలాధారులుసహా అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రతిరోజు 5 నుండి 10 వేల మంది భక్తులకు భోజన, అల్పాహారాలను అందజేసేలా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

यह भी पढ़ें