శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఐపీయూ సభలో భారత పార్లమెంటరీ ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం ఐపీయూ అధ్యక్షుడిగా మిల్టన్ డిక్ ఎన్నిక.. అభినందించిన హరివంశ్

nagendra10 October 2026, 2:40 AM0 చూసులుtrinetnews.com
ఐపీయూ సభలో భారత పార్లమెంటరీ ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం ఐపీయూ అధ్యక్షుడిగా మిల్టన్ డిక్ ఎన్నిక.. అభినందించిన హరివంశ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూ ఢిల్లీ, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్):

టాంజానియాలోని అరుషాలో జరుగుతున్న 153వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ) అసెంబ్లీలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం పలు చర్చలు, కమిటీ సమావేశాల్లో పాల్గొంది. అసెంబ్లీ నాలుగో రోజైన అక్టోబరు 8న వాతావరణ విపత్తులు, సుపరిపాలన, మానవ హక్కులు, కృత్రిమ మేధ వంటి అంశాలపై భారత ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

హిమాలయ ప్రాంతంతోపాటు ఇతర దుర్బల ప్రాంతాల్లో వాతావరణ సంబంధిత విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర పార్లమెంటరీ చర్యలు, విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంపై జరిగిన చర్చలో హరివంశ్‌తోపాటు ప్రతినిధి బృంద సభ్యులు పాల్గొన్నారు. నేపాల్ ప్రతిపాదించిన ఈ అత్యవసర అంశాన్ని అసెంబ్లీ మూడో రోజున ఆమోదించింది. సమ్మిళిత విధానాలు, విశ్వాసం, అందరికీ అవకాశాల ద్వారా సుపరిపాలనను మెరుగుపరచడం, సమాజాలను సాధికారత దిశగా నడిపించడంపై కొనసాగిన సాధారణ చర్చకూ భారత బృందం హాజరైంది.

లోక్‌సభ సభ్యుడు డాక్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ వాతావరణ విపత్తులపై అత్యవసర అంశానికి మద్దతు తెలుపుతూ భారత దృక్పథాన్ని వివరించారు. అనంతరం ప్రజాస్వామ్యం, మానవ హక్కుల స్థాయీ సంఘం బ్యూరో సమావేశంలో పాల్గొని, భవిష్యత్ అసెంబ్లీలకు తీర్మానాల రూపంలో సమర్పించేందుకు పరిశీలిస్తున్న అంశాలపై భారత పార్లమెంట్ వైఖరిని తెలియజేశారు. సంబంధిత స్థాయీ సంఘం సమావేశంలో తీర్మానం ఆమోదానికి తన వంతు సహకారం అందించారు.

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సస్మిత్ పాత్ర ఐక్యరాజ్యసమితి వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశానికి హాజరై, ఘర్షణల నివారణ, పరిష్కారంలో ఐరాస వ్యవస్థ పనితీరుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఐపీయూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికీ హాజరయ్యారు. లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ లతా వాంఖెడే సుస్థిర అభివృద్ధి స్థాయీ సంఘం సమావేశంలో పాల్గొని, కృత్రిమ మేధ–భవిష్యత్ ఉపాధిపై జరిగిన చర్చలో భాగస్వాములయ్యారు.

రాజ్యసభ సెక్రటరీ జనరల్ పార్లమెంట్ల సెక్రటరీ జనరల్స్ సంఘం (ఏఎస్‌జీపీ) సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటుకు నిధుల సమకూర్పు, బడ్జెట్ కేటాయింపు, ఆమోద ప్రక్రియలపై జరిగిన చర్చలో భారత పార్లమెంట్ బడ్జెట్ విధానాలను వివరించారు.

కాగా, అసెంబ్లీ చివరి రోజైన అక్టోబరు 9న ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ స్పీకర్ మిల్టన్ డిక్ ఐపీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫలితం ప్రకటించిన వెంటనే హరివంశ్, భారత ప్రతినిధి బృంద సభ్యులు ఆయనను వ్యక్తిగతంగా అభినందించి, పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →