శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ప్రవాసి ప్రజావాణిని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం

nagendra10 October 2026, 2:37 AM0 చూసులుtrinetnews.com
ప్రవాసి ప్రజావాణిని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం ప్రవాసి ప్రజావాణిని శుక్రవారం సందర్శించారు. సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. ఈ సందర్బంగా జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ ఉక్రెయిన్ యుద్ధంలో 39 రోజుల క్రితం సెప్టెంబర్ 1న మృతి చెందగా... మృతదేహం తరలింపు కోసం, రూ. 6 లక్షలు చెల్లించాలని ఉక్రెయిన్ ఎంబసీ సూచించిన నేపథ్యంలో సహాయం కోసం మృతుని భార్య భార్గవి, తల్లి గంగు, గ్రామ సర్పంచ్ బత్తుల గంగాధర్ తో కలిసి శుక్రవారం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. సీఎంఓ అధికారులతో మాట్లాడి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సీఎం ప్రజావాణిలో 127 దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన 260వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 16 గ్రూపులు, 591 మంది ద్వారా 127 దరఖాస్తులు అందాయి.

రెవెన్యూ శాఖకు 47, విద్యుత్ శాఖకు 15, హోం శాఖకు 14, ఇతర శాఖలకు 51 దరఖాస్తులు అందాయి.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →