శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,163/10g+1.53%
భాషలు

తాజా వార్తలు

ఆడబిడ్డలకు డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి

nagendra10 October 2026, 2:36 AM0 చూసులుtrinetnews.com
ఆడబిడ్డలకు డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 09:

రాష్ట్రం లోని ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బిడ్డలందరికీ

తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలందరూ ఆటపాటలతో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ప్రజల సాంస్కృతిక వైభవాన్ని, మహిళల ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగలో ఎన్నో సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.

బతుకమ్మ సంబురాలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →