సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,32,806/10g+1.11%
భాషలు

తాజా వార్తలు

భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం

nagendra10 October 2026, 2:23 AM1 చూసులుtrinetnews.com
భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం

నాణ్యత, పారదర్శకత, వేగం.. రీ–సర్వేలో అత్యంత కీలకం

*ఉన్న‌త స్ధాయి స‌మీక్ష‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర రీ–సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్ర‌వారం నాడు డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాల‌యంలో స‌ర్వే ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన అధికారుల‌తో భూ సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేలో వేగం ,నాణ్యతతో పాటు ప్రతి దశలో నిరంతర పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు లభించిన ఈ అవకాశాన్ని అధికారులు అత్యంత బాధ్యతతో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రీ–సర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు 7 జోన్లకు ఒక్కో జోన్‌కు రెవెన్యూ , స‌ర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు. సర్వే జరుగుతున్న తీరును, నాణ్యతను, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలించి స్ధానిక ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో తొలి దశలో 365 న‌క్షాలేని గ్రామాల్లో అలాగే జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2,240 మొత్తం 2768 గ్రామాల్లో రీస‌ర్వే ముమ్మ‌రంగా సాగుతుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు 245 గ్రామాల్లో స‌ర్వే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ స‌ర్వేను ప‌ర్య‌వేక్షించేందుకు 14 మంది అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మొద‌టి ద‌శ స‌ర్వేను న‌వంబ‌ర్ చివ‌రినాటికి పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌, జీపీవో, డిప్యూటీ తహసీల్దార్‌ లేదా ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బంది ఉంటారని వివరించారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి రోజు తహసీల్దార్‌ పర్యటించి పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ రోజు ఎక్కడ సర్వే జరిగింది? ఎన్ని ఎకరాలు/సర్వే నంబర్లు పూర్తయ్యాయి? ఎన్ని గ్రామాల్లో పని జరుగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? సర్వేలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అనే అంశాలపై అధికారులు ప్రతిరోజూ స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ–సర్వే జరగాలని మంత్రిగారు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డు

రీ–సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న సర్వే బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్‌ వంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. సర్వేకు అవసరమైన సర్వేయర్లు, రోవర్లు, సర్వర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, సామగ్రి కొనుగోలుకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తుందని, అదనపు రోవర్లను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రీ–సర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనద‌ని ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు తాను స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు.ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల‌ని ఆదేశించారు. రీ–సర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎర్రవల్లి లో 385 ఎకరాలలో 45 ఎకరాలు తక్కువ ఉందని . సర్వే కోసం మరొక సారి నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు కొన్ని చేతులు మారాయి వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటామ‌న్నారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమరవీరులను గుర్తించి వాళ్లకు న్యాయం చేస్తామ‌న్నారు. ఎర్ర‌వెల్లిలో కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేద‌ల‌కు పంచుతామ‌న్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →