Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,239-0.20%
NIFTY22,446-0.49%
HYD 22K₹1,39,708/10g+1.20%
भाषाएँ

Latest News

విలువిద్యకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

nagendra9 October 2026, 2:24 AM0 व्यूtrinetnews.com
విలువిద్యకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 08:

హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరు కావడం గర్వకారణంగా ఉందన్నారు.

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. రామాయణం, మహాభారత కాలం నుంచే విలువిద్యకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు. ఏకలవ్యుడు, అర్జునుడు, ద్రోణాచార్యుడు వంటి మహనీయులు విలువిద్యలో ఆరితేరిన వారని గుర్తుచేశారు. విలువిద్య వంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని మంత్రి అన్నారు. తెలంగాణలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు దేశంలో విలువిద్యకు మరింత ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు, యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా జపాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ లో గోల్డ్ మెడల్ సాధించిన చికితా రావు తో పాటు వివిధ దేశాలకు చెందిన ఆర్చరీ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.

यह भी पढ़ें

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి నిజాయితీ పన్నుదారులకు సులభమైన విధానం.. పన్ను మోసాలపై కఠిన చర్యలు

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి నిజాయితీ పన్నుదారులకు సులభమైన విధానం.. పన్ను మోసాలపై కఠిన చర్యలు

తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం.. మరింత ఆర్థిక నష్టం జరిగే అవకాశం హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి స్క్రాప్ రంగం, గుర్తింపు దొంగతనాలపై మంత్రుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన

और पढ़ें →