శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,907-0.66%
NIFTY22,428-0.57%
22K₹1,39,601/10g+1.12%
భాషలు

తాజా వార్తలు

ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం... అస్త్రం శస్త్రం ...శాస్త్రం..... పార్ట్ 3

nagendra9 October 2026, 2:21 AM0 చూసులుtrinetnews.com
ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం... అస్త్రం శస్త్రం ...శాస్త్రం..... పార్ట్ 3

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

3. పాశుపతాస్త్రం: (inter continental ballistic missile ICBM). ఖండాంతర క్షిపణి.

పరమశివునికి సంబంధించిన ఈ అస్త్రం కంటిచూపుతో గాని మనసుతో గాని శబ్దంతో గాని ప్రయోగించవచ్చు ఇది శత్రువు ఎంత దూరంలో ఉన్నా వెతికి పట్టుకొని సర్వనాశనం చేస్తుంది నేటి గైడెడ్ క్షిపణులు మరియు శత్రువులను ట్రాక్ చేసే ఆర్డర్ వ్యవస్థలు దీనిని పోలి ఉంటాయి.

ఈ అస్త్రాన్ని అర్జునుడు మహాభారత యుద్ధ కాలంలో జయద్రధుని పై ప్రయోగిస్తాడు.జయద్రధుని తండ్రి వృద్ధక్షత్రుడు తన కుమారుని తల ఎవరైతే నేలపై పడవేస్తారో

వారి తల ముక్కలవుతుందని శాపం పెడతాడు.. అందువల్ల కృష్ణుడు అర్జునునితో సైంధవుని తల నేలపై పడకుండా అతని తండ్రి ఒడిలో పడేట్లుగా వేయమంటాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవుని తల అతని తండ్రి ఒడిలో పడేట్లుగా వేస్తాడు. అదేదో అని ప్రేమపడి అతని తండ్రి నేలపై విదిలించి తల పగిలి చనిపోతాడు.

4.నాగాస్త్రం:(The serpent weapon /snake noose) ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ,వేల సంఖ్యలో విష సర్పాలు ప్రత్యక్షమై శత్రువులను కదలకుండా గట్టిగా చుట్టేస్తాయి. రామాయణంలో ఇంద్రజిత్తు లక్ష్మణునిపై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు.

రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీనినే నాగ పాశం అని కూడా అంటారు .దీని వలన వారు స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు గరుత్మంతుడు స్వయంగా అక్కడికి వచ్చి, తన శక్తితో ఆ నాగ బంధాల నుండి వారిని విముక్తులను చేస్తాడు.

మహాభారతంలో కర్ణుడు అర్జునుడిపై నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు .ఆ బాణంలో "అశ్వసేనుడు,," అనే పాము దాగి ఉంటుంది. అది అర్జునుడి తలను తాకే సమయానికి, శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలుతో రథాన్ని భూమిలోకి కొద్దిగా నొక్కుతాడు .దీనివల్ల బాణం అర్జునుడి కిరీటాన్ని మాత్రమే ఎగరగొడుతుంది.

5.గరుడాస్త్రం: (eagle weapon) ఇది నాగాస్త్రానికి విరుగుడు అస్త్రం. నాగాస్త్రం వల్ల వచ్చే పాములను అంతం చేయటానికి గరుడ పక్షులను రప్పించే అస్త్రం ఇది.

6.వజ్రాస్త్రం: (thunderbolt weapon) ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధం వంటి శక్తిని కలిగిన అస్త్రం ఇది. ఇది యుద్ధ సమయంలో పిడుగుల వంటి భయంకరమైన విద్యుత్ శక్తిని విడుదల చేసి శత్రువులను దెబ్బతీస్తుంది.

7. ఇంద్రాస్త్రం: (the weapon of Indra )

దేవతల రాజైన ఇంద్రుడి అస్త్రం. దీనిని ప్రయోగిస్తే ఒకేసారి వేల సంఖ్యలో బాణాలు వర్షంలో కురుస్తాయి.

రామాయణంలో ఈ అస్త్రం శ్రీరాముడు లక్ష్మణుడు మరియు రామణుడి కుమారుడైన ఇంద్రజిత్తుల వద్ద ఉండేది.

శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షస వీరుడైన ఖరుని పై , కుంభకర్ణునిపై ప్రయోగిస్తాడు.

లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై ప్రయోగించి అతనిని సంహరిస్తాడు.

మహాభారతంలో అర్జునుడు పలుమార్లు ఈ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఉత్తర గోగ్రహణం సమయంలో కూడా అర్జునుడు కౌరవ సైన్యంపై,17 వ రోజు యుద్ధం లో సంశప్తకుల పై, సుదక్షిణుడు పై ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు.

8. ఆగ్నేయాస్త్రం: (the fire weapon /weapon of Agni) ఈ అస్త్రానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు దీనిని ప్రయోగించినప్పుడు ఆకాశం నుండి విపరీతమైన మంటలు నిప్పులు వర్షాల్లా కురుస్తాయి శత్రు సైన్యాన్ని కాల్చి బూడిద చేయడానికి దీనిని వాడుతారు..

9. వరుణాస్త్రం: (the water weapon) ఈ అస్త్రం ఆగ్నేయాస్త్రానికి విరుగుడు. దీని అధిష్టాన దేవత జలాధిపతి అయిన వరుణుడు. దీని ద్వారా విపరీతమైన నీటి ఉధృతి పుడుతుంది.

ఇలా ఈ అస్త్రాలు అన్నీ కూడా రామాయణ, భారత కాలాల్లో వాడబడినట్లు పురాణ గాథలు చెబుతాయి.

శుభోదయం.... శశిబాల

ఇవి కూడా చదవండి

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి నిజాయితీ పన్నుదారులకు సులభమైన విధానం.. పన్ను మోసాలపై కఠిన చర్యలు

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి నిజాయితీ పన్నుదారులకు సులభమైన విధానం.. పన్ను మోసాలపై కఠిన చర్యలు

తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం.. మరింత ఆర్థిక నష్టం జరిగే అవకాశం హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి స్క్రాప్ రంగం, గుర్తింపు దొంగతనాలపై మంత్రుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన

మిగతా చదవండి →