Thursday8 October 2026Hyderabad

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,991/10g-0.09%
Languages

Latest News

టీ.జీ.ఓ. మహిళా విభాగం బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendra8 October 2026, 12:42 PM7 viewstrinetnews.com
టీ.జీ.ఓ. మహిళా విభాగం బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 8:

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ అసోసియేషన్ ) మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా టీ.జీ.ఓ. మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ఒక గొప్ప ప్రతీక అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. టీ.జీ.ఓ. మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. మహిళా ఉద్యోగులలో సాంస్కృతిక చైతన్యం, ఐక్యత, సోదరభావం పెంపొందించడంతో పాటు తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల జీవన విధానంలో అంతర్భాగమని, పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని ఆరాధిస్తూ, సమిష్టిగా పాటలు పాడుతూ నిర్వహించే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని టీ.జీ.ఓ. మహిళా విభాగం నాయకులు పేర్కొన్నారు. “బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని వారు అన్నారు.

మహిళా ఉద్యోగులందరూ బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీ.జీ.ఓ. మహిళా విభాగం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే విధంగా ఈ వేడుకలను ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో నిర్వహించాలని కోరింది.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీ.జీ.ఓ. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాస్ రావు

,జనరల్ సెక్రటరీ బి శ్యామ్, మహిళా విభాగం విమెన్ చైర్పర్సన్ డా జి దీపా రెడ్డి, కన్వీనర్ జే సుజాత, శాంతి కిరణ్మయి, పూనం, అనిత,

మమత, చంద్రజ్యోతి, వనజ మరియు వివిధ శాఖలకు చెందిన మహిళా గెజిటెడ్ అధికారులు, ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.

Also read