Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,287/10g+0.13%
भाषाएँ

Latest News

మానవీయ విలువలతో కూడిన జైలు వ్యవస్థ అవసరం జైలు పరిపాలనలో టెక్నాలజీ కీలక పాత్ర

జైలు పరిపాలనలో మహిళా అధికారుల పాత్ర ప్రత్యేకం జైలు వ్యవస్థ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ముఖ్య భాగం ఖైదీల మానవీయ, మానసిక, సామాజిక అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి ఖైదీలకు జైలు అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

nagendra8 October 2026, 12:37 PM0 व्यूtrinetnews.com
మానవీయ విలువలతో కూడిన జైలు వ్యవస్థ అవసరం జైలు పరిపాలనలో టెక్నాలజీ కీలక పాత్ర

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 8:

మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే జైలు వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో మహిళా జైలు అధికారుల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. జైలు పరిపాలనలో సాంకేతికత భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని పోలీస్ రీసెర్డ్ అండ్ డెవలెప్ మెంట్ బ్యూరో లోని సెంట్రల్ అకాడమీ ఫర్ పోలీస్ ట్రైనింగ్ (CAPT) కేంద్రంలో “జైలు పరిపాలనలో మహిళా ఆఫీసర్లు” అనే అంశంపై 5వ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జైలు పరిపాలనలో మహిళా సిబ్బంది పాత్ర, సేవలు, వృత్తిపరమైన అభివృద్ధి, నాయకత్వం, జైలు పరిపాలనలో ఎదురవుతున్న కొత్త సవాళ్లు, ఉత్తమ విధానాలు వంటి అంశాలపై కేంద్ర మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. ఈకార్యక్రమంలో బీపీఆర్డీ డైరెక్టర్ జనరల్ అలోక్ మిత్తల్, ఐజీ అండ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ జితేంద్ర సింగ్ మీనా, పలువురు మహిళా జైలు ఉన్నతాధికారులు, విద్యా రంగ ప్రతినిధులు, జైళ్లు, సంస్కరణ పరిపాలనలో పనిచేస్తున్న నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా పరిపాలనలో అత్యంత సవాళ్లతో కూడిన, సామాజికంగా ఎంతో ముఖ్యమైన రంగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారుల కోసం ఇలాంటి జాతీయ వేదికను ఏర్పాటు చేసిన బీపీఆర్డీ అధికారులను అభినందించారు. యూనిఫాం వెనుక ఉన్న మహిళలు ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆరోగ్యం, ఉత్తమ పద్ధతుల నుంచి సంస్థాగత మార్పుల వరకు, ఆదర్శ జైలు మాన్యువల్ మార్గదర్శకాల నుంచి ఆధునిక సంస్కరణాత్మక వ్యవస్థ వరకు, ఖైదీ తల్లులు , వారి పిల్లలు నిర్బంధం నుంచి సంరక్షణ విషయంలో నిరంతర సహాయం వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో జైలు సంస్కరణలకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జైళ్లను ఆధునీకరించడానికి, ఖైదీల పునరావాసం, సంస్కరణలకు సహాయం చేయడానికి అవసరమైన సహకారం అందిస్తున్నాం అని చెప్పారు

అయితే, ప్రస్తుత జైలు చట్టాలు, నిబంధనలు, నియమాల్లో మార్పులు చేయడంలో ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి అన్నారు. యూనిఫాం సేవల్లో మహిళల పాత్రలో గత కొన్నేళ్లుగా గణనీయమైన మార్పు వచ్చింది. నేడు మహిళలు కమాండర్లు, పరిపాలకులు, శిక్షకులు, దర్యాప్తు అధికారులు, కౌన్సిలర్లు, పాలసీ నిపుణులు, సంస్థాగత నాయకులుగా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

జైలు పరిపాలనలో మహిళా అధికారుల పాత్ర ప్రత్యేకమైనదన్నారు. జైలు వ్యవస్థ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం అని, జైలులో ఉన్న వ్యక్తుల మానవీయ, మానసిక, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని భద్రత, క్రమశిక్షణను కాపాడటం జైలు వ్యవస్థ బాధ్యత. జైలు అధికారులు - సంరక్షకులుగా, నిర్వాహకులుగా, నాయకులుగా, మార్గదర్శకులుగా ఉంటూ మార్పును తీసుకువచ్చే వ్యక్తులుగా పనిచేయాలన్నారు. మహిళా ఖైదీల నిర్వహణ, వారితోపాటు జైలులో ఉండే పిల్లల సంరక్షణ, వారి భద్రత, కుటుంబ సభ్యులతో సంబంధాలను కొనసాగించడం, ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య సహాయం, వృత్తి శిక్షణ, పునరావాసం, విడుదలకు సిద్ధం చేయడం వంటి అంశాల్లో మహిళా అధికారుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు.

బీపీఆర్డీ జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దీని పరిధి కేవలం పోలీసింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇందులో సంస్కరణాత్మక పరిపాలన, పరిశోధన, శిక్షణ, సామర్థ్య నిర్మాణం, ఉత్తమ పద్ధతులను విస్తరించాయని వివరించారు. బీపీఆర్డీ క్షేత్రస్థాయి అనుభవాలు, పరిశోధన ఫలితాలు, విధాన రూపకల్పన మధ్య ఒక వారధిగా పనిచేయగలదు. ఆధునిక జైలు వ్యవస్థలో మహిళా ఖైదీల అవసరాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండవచ్చని మనం అర్థం చేసుకోవాలన్నారు. అందుకే వారికి ఆరోగ్య సేవలు, ప్రసూతి ప్రజనన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, పిల్లల సంరక్షణ, భద్రత, వ్యక్తిగత గోప్యత, విద్య, వృత్తి నైపుణ్యాలు, సమాజంలో తిరిగి కలిసే అవకాశం వంటి అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు అవసరం కావచ్చని పేర్కొన్నారు. అందువల్ల, జైలు పరిపాలనలో మహిళల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకునే విధానం ఉండాలని సూచించారు.

వృత్తిపరమైన నైపుణ్యాలు, సామర్థ్య నిర్మాణం కీలకమైనవి. భవిష్యత్ జైలు వ్యవస్థకు మరింత మంది నిపుణులైన సిబ్బంది అవసరం ఉంటుందని, ఆధునిక జైలు పరిపాలనకు క్రిమినాలజీ, పెనాలజీ, సైకాలజీ, బిహేవియర్ సైన్స్, మానసిక ఆరోగ్య నిర్వహణ, జైలు భద్రత, ఇంటెలిజెన్స్, సైబర్ టెక్నాలజీ, డేటా విశ్లేషణ, వివాదాల నిర్వహణ, మాదకద్రవ్యాల వినియోగ నియంత్రణ, వృత్తి ఆధారిత పునరావాసం, చట్టపరమైన, మానవ హక్కుల అంశాలు, జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో తిరిగి కలిసే విధానం వంటి విషయాలపై అవగాహన అవసరం అని కేంద్ర మంత్రి చెప్పారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →