Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,869/10g-0.18%
भाषाएँ

Latest News

భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు పండ్ల పంపిణీ ముఖ్య అతిథిగా గోలి ప్రభాకర్‌.. రాపోలు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం

nagendra8 October 2026, 12:14 PM7 व्यूtrinetnews.com
భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు పండ్ల పంపిణీ ముఖ్య అతిథిగా గోలి ప్రభాకర్‌.. రాపోలు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం

Share this story

Share link keeps your language (?lang=)

నల్గొండ, అక్టోబరు 8 (ట్రైనెట్ న్యూస్):

నరేంద్ర మోదీ ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దివ్యాంగుల విభాగం నల్గొండ జిల్లా కన్వీనర్ రాపోలు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ మండలంలోని ప్రభుత్వ ప్రత్యేక అవసరాల వనరుల కేంద్రం ‘భవిత’లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగ విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గోలి ప్రభాకర్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ద్వారా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచడంతోపాటు 21 రకాల వైకల్యాలకు గుర్తింపు కల్పించిందని పేర్కొన్నారు. ‘వికలాంగులు’ అనే పదానికి బదులుగా ‘దివ్యాంగులు’ అనే గౌరవప్రదమైన పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారని తెలిపారు. అలిమ్‌కో సంస్థ ద్వారా దివ్యాంగులకు సహాయక పరికరాలు అందిస్తున్నారని చెప్పారు.

కార్యక్రమంలో బీజేపీ దివ్యాంగుల విభాగం జిల్లా కమిటీ సభ్యుడు పగిళ్ల యాదయ్య, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు గోలి మహేశ్వరి, భవిత కేంద్రం ఐఈఆర్‌టీ కె. శైలజ, ఎస్‌జీటీ జె. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →