హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 08:
మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు; గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు; జార్ఖండ్ & ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించాయి.
నైరుతి రుతుపవనాల తిరోగమణ రేఖ ఇప్పుడు 27.5°N/86.5°E, సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బిజాపూర్, హైదరాబాద్, బెళగావి, పంజిమ్ 15°N/72°E గుండా వెళుతోంది.
తెలంగాణలో ఈ తిరోగమణ రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం మరియు భూపాలపల్లి గుండా వెళుతోంది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు భారతదేశం మరియు ఉత్తర ద్వీపకల్పంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.





