Thursday8 October 2026Hyderabad

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,928/10g-0.13%
Languages

Latest News

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇసుక లారీ బీభత్సం..

nagendra8 October 2026, 11:56 AM0 viewstrinetnews.com
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇసుక లారీ బీభత్సం..

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 08:

ములుగు జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఇసుక లారీ రెండు వాహనాలను ఢీకొట్టడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పస్రా - తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది..మొదట సీఆర్పీఎఫ్ జవానులు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా..అదే లారీ కొంచం ముందుకు వెళ్లి ఎదురుగా వస్తున్న కారును కూడా బలంగా ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణిస్తున్న రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు నుజ్జునుజ్జయ్యారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఓవర్ స్పీడ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒకే లారీ రెండు వాహనాలను ఢీకొట్టడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపడుతున్నారు.

Also read