హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 04 : రాష్ట్రం కరువుతో అల్లాడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 20 అడుగులు పడిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం చేసినా.. వర్షాలు పడక పోవడంతో ఆయన చేతులెత్తేశారని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.విద్యుత్ కోతలు నిరూపించేందుకు సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రమ్మన్నా వస్తానంటూ ఆయనకు కవిత సవాల్ విసిరారు. ప్రభుత్వం ఏం చేసైనా రైతులకు కరెంట్ ఇచ్చి తీరాల్సిందేనని సీఎం రేవంత్‌కి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నిండుగా నీళ్లున్నా రాష్ట్రంలోని ప్రాజెక్టులను వాటితో నింపలేదని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రశ్నించారు
తాజా వార్తలు
తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
'తత్వం' క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ

'తత్వం'లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో
మిగతా చదవండి →ఘనంగా జేఎంఎఫ్‌ఏ 30 ఏళ్ల వేడుకలు

ఘనంగా జేఎంఎఫ్‌ఏ 30 ఏళ్ల వేడుకలు హైదరాబాద్, అక్టోబర్ 4 (ట్రినెట్ న్యూస్): జేఎంఎఫ్‌ఏ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జన్మదిన వేడుకలు జర
మిగతా చదవండి →కాచిగూడలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

సి.సి.షరాఫ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, విశేష స్పందన... - పేదలు ఉచిత వైద్య శిబిరాల ను సద్వినియోగం చేసుకోవాలి : - కాచిగూడ సి.సి.షరాఫ్ మెమోరియల్ హాస్పిటల్ ట్రస్టీలు ఎన్.సుకుమార్, ఎన్. గాయత్రి ట్రైనెట్ న్యూస్, హైద
మిగతా చదవండి →గాంధీజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం: ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్, అక్టోబర్ 2 (ట్రైనెట్ న్యూస్): భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి, అహింసా మార్గంలో దేశానికి స్వేచ్ఛను అందించిన జాతిపిత మహాత్మా గాం
మిగతా చదవండి →