Monday28 September 2026Hyderabad

SENSEX72,806-2.31%
NIFTY22,780-2.35%
HYD 22K₹1,37,943/10g-3.06%
Languages

Latest News

రైతుల సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

రైతుల సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలిపి, సమన్వయంతో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.

nagendra26 September 2026, 4:02 AM4 viewstrinetnews.com
రైతుల సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24:

రైతుల సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోరిన వెంటనే రాష్ట్రానికి నీరు విడుదల చేసేందుకు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

సాగునీటి విషయంలో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమాచార లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు తదితర వివరాలను ప్రతిరోజూ మీడియాకు తెలియజేయాలని సూచించారు. తద్వారా రైతులు, ప్రజలకు నీటి పరిస్థితిపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని తెలిపారు. సాగునీటి పంపిణీలో వారబంధీ విధానాన్ని రైతులకు ముందుగానే వివరించి, అందుకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యతకు అనుగుణంగా సాగునీటి సరఫరాను కొనసాగించాలని అన్నారు.

నీటి విడుదలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఏవైనా ఆదేశాలు లేదా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, రైతుల మధ్య నిరంతర సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, సమాచార లోపాలను పూర్తిగా తొలగించడం ద్వారా సాగునీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

Also read