E-PaperE-PaperPDF · Clip · Archive
Languages

Chief Editor: Rapolu Venkateshwarlu

Change edition

Thursday24 September 2026

HyderabadSunrise 6:05 amSunset 6:10 pm

Thursday

24 September 2026

Hyderabad

Sunrise 6:05 am

Sunset 6:10 pm

SENSEX74,117-0.24%
NIFTY23,204-0.61%
HYD 22K₹1,42,217/10g-1.46%
HYD 24K₹1,55,146/10g-1.46%
SILVER₹2,15,129/kg-1.84%

Latest News

ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు -రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

nagendra24 September 2026, 4:10 AM1 viewstrinetnews.com
ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు   -రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:

ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయనున్నామని, ప్రతి గ్రామం నుండి మండలానికి, మండలం నుండి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ పెంచేలా రోడ్లు వేయన్నున్నట్లు రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. సింగిల్ లేన్ నుండి డబుల్ రోడ్, ఫోర్ లేన్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామన్నారు.

ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ భవన్ లో ఎల్ నినో ఎఫెక్ట్ - సాగునీటి రంగం, వ్యవసాయం అంశంపై జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లగొండ కు చెందిన ఇంజనీర్ గుర్రం కోటిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గుర్రం కోటిరెడ్డి మెమోరియల్ అవార్డు గ్రహీతలను సన్మానించి, అవార్డు లు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కోటిరెడ్డి లాగే ఆలోచించే వ్యక్తి రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని.. బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్లు చూస్తుంటే శ్యామ్ ప్రసాద్ గుర్తుకు వస్తారు. ఇంజనీర్ విభాగంలో ప్రముఖులైన వీరు నల్గొండ జిల్లాలో పుట్టడం చాలా సంతోషం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల నిర్మాణంలో కృషి చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గర నుండి ఇంజనీర్లందర్నీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంజనీర్లు లేనిదే దేశం లేదు. వ్యవసాయం రంగంలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనదన్నారు. కరోనా లాగే నేడు ఎల్నినో కరువు పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందని చెప్పారు. ఎల్ నినో వల్ల వర్షాలు లేక, రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, కరువును ఎదుర్కునేందుకు ప్రభుత్వానికి మీరందరూ సూచనలివ్వాలన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుగా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తుందని, ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ పట్టుబట్టి నాడు వైస్సార్ హయంలో సాధించాను అని తెలిపారు.

ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైనదన్నారు. సీ.ఈ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, గ్రావిటీ పైన రెండు పంటలకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పుకొచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి అయితే నా జన్మధన్యం అవుతుందని మంత్రి తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా, సీతక్క పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మొదటి ఫేజ్ లో 20వేల కోట్లతో హామ్ రోడ్లు నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సైంటిస్ట్ మురళి, చైర్మన్ ప్రొఫెసర్ రమణ నాయక్, సెక్రటరీలు వెంకటేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also read