E-PaperE-PaperPDF · Clip · Archive
Languages

Chief Editor: Rapolu Venkateshwarlu

Change edition

Tuesday22 September 2026

HyderabadSunrise 6:05 amSunset 6:12 pm

Tuesday

22 September 2026

Hyderabad

Sunrise 6:05 am

Sunset 6:12 pm

SENSEX74,529+0.26%
NIFTY23,329+0.48%
HYD 22K₹1,42,812/10g-1.09%
HYD 24K₹1,55,795/10g-1.09%
SILVER₹2,18,742/kg+0.67%

Latest News

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు ఎంపీ ఈటెల రాజేందర్

Super Admin22 September 2026, 9:27 AM8 viewstrinetnews.com
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు   ఎంపీ ఈటెల రాజేందర్

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రాజకీయ డ్రామాలు ఆపండని, మిమ్మల్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారని

మండిపడ్డారు. పంటలు ఎండడం చూస్తుంటే పల్లె పల్లెల పల్లెర్లు మొలిచాయని అనే పాట గుర్తుకు వస్తుందన్నారు. ⁠ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది,

పోయేకాలం వచ్చిందని ఎద్దేవా చేశారు. గోదావరిలో నీళ్లు పారుతున్నప్పుడు ఎత్తి పోయకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది అని ఎంపీ అన్నారు. ఒకపక్క నీళ్లు లేక మరోపక్క కరెంటు కోతలతో పంటలు ఎండుతుంటే.. రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వహించినట్లు ఉందని

రేవంత్ రెడ్డి వ్యవహారం అన్నారు. జూరాల నీళ్లు ఇవ్వాలని వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం ఆపి రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.

Also read